అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో మదనపల్లె జిల్లా సాధన కమిటీ అత్యవసర సమావేశం శనివారం. నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. మదనపల్లి జిల్లా ప్రస్తావన లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. మదనపల్లె జిల్లా ఏర్పాటును ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జిల్లా సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.