శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని చిన్మయ విద్యాలయలో పెనుకొండ డివిజనల్ స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ పై శిక్షణ, సైన్స్, గణిత ఉపాధ్యాయులకు ఇన్స్పైర్ కు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, సమస్యలను ఎలా సమస్యలను ఎలా పరిష్కరించాలి అన్న అంశాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులను గైడ్ చేసి పంపించే ప్రాజెక్ట్ (ప్రయోగ నమూనా) వినూత్నంగా ఉండాలని సూచించారు. దీనికి తోడు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని తెలిపారు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాల నుండి మూడు నమూనాలు, ఉన్నత పాఠశాల నుండి 5, ఇంటర్మీడియట్ నుండి 3 నమూనాలు పంపాల్సి ఉంటుందని తెలిపారు.