మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును విమర్శించే అర్హత ఏఎంసీ ఛైర్మన్ కొండేటి శివకు లేదని తణుకు మాజీ ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి అన్నారు. సోమవారం తణుకు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తణుకు ఏఎంసీ వ్యవస్థను భ్రష్టు పట్టించింది కేవలం తెలుగుదేశం పార్టీ హాయంలోనే అని విమర్శించారు. ఏఎంసీ ఛైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అని అన్నారు.