వినాయక చవితి సందర్భంగా కడప నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు గణనాథులను దర్శించిన నాయకులు, ప్రజలందరికీ వినాయకుడి ఆశీస్సులు లభించి, ప్రతి కుటుంబం సుఖశాంతులతో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.