బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాన్సువాడ డివిజన్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు బాన్సువాడ సీఐ అశోక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాన్ని స్వల్పంగా ధ్వంసం చేశారని వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సంఘం నాయకులు బంగారు మైసయ్య డిమాండ్ చేశారు.