కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జాగిరిపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం కనపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాలలోకి వెళితే జాగిరిపల్లి లోని ఓ వ్యవసాయ బావిలో గురువారం మధ్యాహ్నం మృతదేహం తెలియాడుతూ కనిపించింది. స్థానికులు చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మానకొండూరు పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని మరియు బైకును పైకి తీశారు. అయితే మృతుడిని మండల పరిధిలోని శ్రీనివాస నగర్కు చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కో