అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో బుధవారం ఎర్రిస్వామి అన్న యువకుడికి ఫిట్స్ రావడంతో బైక్ నుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుడు కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని జెడ్.వీరారెడ్డి కాలనీకి చెందిన ఎర్రిస్వామి పని నిమిత్తం బైక్ పై పోలీసు స్టేషన్ వైపుకు వెళ్తుండగా గాంధీ చౌక్ వద్ద ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. దీంతో బైక్ లో నుంచి పడి ఎరిస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనంతపురంకు తరలించారు.