పలమనేరు: మండల పోలీస్ స్టేషన్ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. నాగమంగళం, రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఓ టీ షాప్ ముందు రోడ్డుపై నిలిపి ఉంచిన జేసీబీని బెంగళూరు నుండి పలమనేరు వైపు వస్తున్న ఓ కారు ఢీకొంది, దీంతో అందులో ఉన్నటువంటి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన 108 సహాయంతో పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారని తెలిపారు. కాగా ఘటన ప్రాంతం కి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.