ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేట్ వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తృటిలో తప్పింది. బుధవారం సాయంత్రం సుమారు 5గంటల సమయంలో తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భీమడోలు రైల్వేగేటు బస్టాప్ వద్ద ప్రయాణికులను దింపి ఎక్కించుకునే సమయంలో ఒక లారీ ఆర్టీసీ బస్సును పక్క నుంచి ఢీకొట్టింది ప్రమాదంలో డ్రైవర్ సైడ్ మిర్రర్, సైడ్ గ్లాస్ పగిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం తో బస్సులోని ప్రయాణికులు ఆందోళన చెందారు.