నారాయణపేట జిల్లా కాన్కుర్తి గ్రామంలో బలవంతపు భూ సేకరణ వద్దంటూ ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ రాకతో విరమించారు. ఉదయం నిద్ర లేచే సరికే తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా సర్వేకు రావడం ఏంటని ఆయనను నిలదీశారు. అందుకు సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీ మరో మారు రైతులతో అధికారులు, నాయకులు సమావేశం నిర్వహించిన తర్వాతే భూ సేకరణ చేస్తామని చెప్పారు. అధికారులు వెళ్లిపోవడంతో ఆందోళన విరమించారు