కరీంనగర్ సీతారాంపూర్ లో ఎటువంటి అనుమతులు లేకుండా మహిళ సంఘం నిర్మాణం చేపట్టారని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కొత్తపల్లి ఎమ్మార్వో వెంకటలక్ష్మి నిర్మాణాన్ని విద్యాశాఖ కేటాయిస్తూ నోటీసులు జారీ చేశారని,మహిళా సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాత్రి ధర్నా నిర్వహించారు. సీతారాంపూర్ లో మహిళ సమైక్య భవనం కోసం నిర్మిస్తే ఈ భవనాన్ని విద్యాశాఖకు కేటాయించడం ఏంటి అని ప్రశ్నించారు. ఘటన స్థలానికి ఎమ్మార్వో వెంకటలక్ష్మి చేరుకుని మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ భవనాన్ని ఎమ్మార్వో వెంకటలక్ష్మి తన ఆధీనంలోకి ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. శిఖం భూమిలో నిర్మాణం చేపట్టారని ఎమ్మార్వో తెలిపారు.