తమకు రావలసిన ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 164 రద్దు చేయాలని మెప్మా ఆర్పీల జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టర్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మెప్మా ఆర్పీలకు గత ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు. దీంతో తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. 164 జీవో ప్రకారం శ్రీనిధి విఎల్ఆర్ నుంచి వేతనాలు ఇవ్వాల్సి ఉన్న, ఇంకా తమకు గౌరవ వేతనం సరిగా అందడం లేదన్నారు.