నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలంలోని దట్టమైన అడవిలో ఉన్న లొంక రామలింగేశ్వర ఆలయాన్ని గురువారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దర్శించారు. పుష్కరిణిలో స్నానం చేసి, రుద్రాభిషేకం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన కమిషనర్, పచ్చని చెట్లు, నీటి సెలయేళ్ల ఈ క్షేత్రం ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు.