Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగంలోని కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో ఓ వృద్ధుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వంతెన పై బ్యాగు చెప్పులు వదిలి కాలువలో దూకినట్లు స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ తమ సిబ్బందితో కలిసి కనిగిరి రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. రిజర్వాయర్ లో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.