తాండూరు మండల కేంద్రంలో వినాయక నిమజ్జనానికి తాండూరు పెద్ద చెరువు ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు పరిశీలించారు వినాయక శోభయాత్ర అనంతరం నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు