Download Now Banner

This browser does not support the video element.

కనిగిరి: పట్టణంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి

Kanigiri, Prakasam | Aug 26, 2025
కనిగిరి పట్టణంలోని పలు ఎరువులు దుకాణాలను ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణాలలోని స్టాకును ఆర్డీవో పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి , రిజిస్టర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఎరువుల నిల్వలు ఉన్నాయో లేవో సరి చూసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎరువులు దుకాణాలలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలో రైతులకు సరఫరా చేసేందుకు సరిపడినంత ఎరువుల నిల్వలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఏడీఏ జైనులాబ్దిన్, తహసిల్దార్ రవిశంకర్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us