Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 27, 2025
మాజీ గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహానికి కావలిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేశ్ తెలిపారు. స్థల సేకరణ కోసం ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా తటవర్తి రమేశ్ తన వంతు రూ.50,000 విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.