Download Now Banner

This browser does not support the video element.

బాన్సువాడ: వర్షాల మూలంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలి; సంగోజి పేటలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

Banswada, Kamareddy | Sep 2, 2025
భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. మండలంలోని సంగోజిపేటలో ఇటీవల వర్షాలకు ధ్వంసమైన రోడ్లను మంగళవారం 3 గంటలకు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా రోడ్ల మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు వేగంగా పూర్తి చేసి గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో ఆనంద్, పిఆర్ ఏఈ, మాజీ ఎంపిటిసి జెట్టి హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us