చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన 90 ఏళ్ల చాపిడి సోంబాయి తమ భూమి కోసం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టింది. ఆగస్టు 4వ తేదీన సబ్ కలెక్టర్ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినా ఆలస్యం జరుగుతుందని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆదివారం ఎమ్మెల్సీ దండే విటల్ తమ భూమిలో అంబేద్కర్ భవన కాంపౌండ్ వాల్ కు భూమి పూజ చేశారని వృద్ధురాలు తెలియజేసింది. చప్పిడి సోంబాయి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు,