భూ సేకరణ విషయంలో రైతులను ఒప్పించి, వారికి సరైన పరిహారం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మహబూబ్నగర్ జిల్లా వేములలో ఎస్జీడీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిందని, అన్ని అడ్డంకులను తొలగించి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.