తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఆరుగొలను చెరువులో ఈ నెల 8న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతుని కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో శనివారం తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ యల్లా శ్రీనివాసరావు తన సొంత ఖర్చులతో యాగర్లపల్లి శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.