Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 5, 2025
కలిగిరి మండలం, నాగిరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బైక్ను వెనుక నుంచి మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడిన వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి కలిగిరి ఎస్సై ఉమాశంకర్ దర్యాప్తు చేస్తున్నారు.