శంషాబాద్లో ఓ లారీ డ్రైవర్ రెచ్చిపోయాడు. స్థానికుల వివరాలు.. ఆదివారం రా. ఓ హోండా యాక్టివాను లారీ ఢీ కొట్టి, ఈడ్చుకెళ్లింది. రాంగ్ రూట్లో దాదాపు 2 కిలోమీటర్ల మేర యాక్టివాను లారీ ఈడ్చుకెళ్లింది. కొందరు యువకులు లారీని వెంబడించి అడ్డుకొన్నారు. డ్రైవర్ను కిందకు దించి పోలీసులకు అప్పజెప్పారు. అయితే, సదరు హోండా యాక్టివా మీద ఉన్న వ్యక్తి ఎవరు? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.