కామారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన విపత్తులో చిక్కుకున్న ప్రజలకు అన్నివిధాల ఆదుకుంటున్నామని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ తెలిపారు. శుక్రవారం ఆయన వరద బాధితుల పునరావాస కేంద్రాలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. 6ఎస్టిఆర్ఎఫ్, 2ఎన్ డి ఆర్ఎఫ్ రిస్క్యు టీమ్స్ వరదలో ఇరుక్కున్న వారిని కాపాడుతూ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయని,అక్కడ వారికి భోజన సౌకర్యం కల్పించామని, హోసింగ్ బోర్డు కాలనీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు