మాచారెడ్డి మండల కేంద్రంలో మంగళవారం ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ ఆదర్శ్ శ్రీవాణి జనరల్ మెడిసిన్ విభాగంలో సేవలు అందించారు. రోగుల ఆరోగ్యాన్ని పరిశీలించి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని చికిత్స పొందారు ప్రజలకు మరింత నాణ్యమైన సదుపాయాన్ని అందిస్తామని డాక్టర్ ఆదర్శ్ తెలిపారు. ప్రభుత్వం అందించే ఉచిత వైద్య శిబిరాలను మహిళలు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఉచిత మందులను స్వీకరించి ముందుగానే ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలని తెలిపార