ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జైనథ్ మండలంలోని తర్నం వాగు పై నుండి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. 3 రోజుల పాటు భారీ వర్షలు కురియనున్న కారణంగా బుధవారం నుండి తర్నం తాత్కాలిక బ్రిడ్జి నుండి రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణికులు లాండసాంగి గ్రామం మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు. రాకపోకలు నిలిపివేయడంతో తర్నం వాగు వద్దవాహనాలు నిలిచిపోయి కాసేపు ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.