అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు నిర్వహించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి లడ్డు వేలంపాట పోటీలు పోటా పోటీగా జరిగాయి. బెలుగుప్ప వినాయక దేవాలయంలో నిర్వహించిన లడ్డు వేలంపాట పోటీలో పద్మ గోవిందు రూ. 75001, దుద్దేకుంట గ్రామంలో వాల్మీకి సేవా సమితి నిర్వహించిన వేలం పాటలో కొల్లాయప్ప గారి రుద్రప్ప రూ.42000, బ్రాహ్మణపల్లి తాండాలో నిర్వహించిన వేలంపాటలో వి నారాయణ నాయక్ రూ.91150, బెలుగుప్ప ఎస్సీ కాలనీలో నిర్వహించిన వేలం పాటలో రాజేష్ రూ. 4516 నగదులతో లడ్డుని కేవలం చేసుకున్నారు.