చిత్తూరు జిల్లా.పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాంతంలో DCHS డాక్టర్ పద్మాంజలి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వార్డుల్లోకి వెళ్లి రోగులను పలకరించి వైద్యులు చికిత్సలు అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మందుల నిల్వ, ఇతర రికార్డులను పరిశీలించారు. జ్వరం పీడితులకు అన్ని రకాల పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే సమయపాలన పాటించి అందుబాటులో ఉండాలని డాక్టర్లుకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముధుసూదన చారి, వైద్య సిబ్బంది నాగే నాయక్. మధుబాల, భారతమ్మ ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.