మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తిలో అంగన్వాడి స్కూల్ నూతన భవనానికి మంగళవారం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.