అశ్వారావుపేట మండలం గోపన్న గుడెం,కావడి గుండ్ల మధ్య వాగులో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు.ఆంధ్ర ప్రాంతం పూచికపాడు గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళలు చెన్నాపురం వద్ద పత్తి చేలో కూలి పనులు చేసుకుని తిరుగు ప్రయాణంలో గుబ్బల మంగమ్మ వాగు దాటుతూ నలుగురు వాగులో కొట్టుకుపోయారు. ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటకు రాగా పచ్చిసాల వరలక్ష్మి ,పాలడుగుల చెన్నమ్మ అనే ఇద్దరు మహిళలు వాగులో గల్లంతయ్యారు.