బెల్లంపల్లి మండలం అకెనపల్లి గ్రామంలో ఉన్న సర్వే నెం.3/పైకి లోని 2-75 సెంట్లు కోర్టు కేసులో ఉన్న భూమిని అనధికారికంగా ఆక్రమించారని భూమి యజమాని రాం కృష్ణయ్య కోర్ట్ లో కేసు వేశారు.40 సంవత్సరాల తర్వాత కేసు గెలవడంతో సివిల్ కోర్ట్ నోటీసుఇచ్చిన తేదీ నుండి 3రోజులలోపు స్వచ్ఛందంగా ఇళ్ల నిర్మాణాలను ఖాళీ చేయాలని బెల్లంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది గడువులోపు ఖాళీ చేయకపోతే కోర్టు ఆదేశాల ప్రకారం 13 ఇంటి నిర్మాణాలను బలవంతంగా ఖాళీ చేయిస్తారని నోటీసులో కోర్టు పేర్కొంది.దీంతో కోర్టు సిబ్బంది,అధికారులు నిర్మాణాలను కూల్చివేయడానికి సిద్ధమవడంతో ఇండ్ల యజమానులు అడ్డుకున్నారు