ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలన్నిటిని మరిచిపోయి ఉద్యోగులకు మొండి చేయి చూపెట్టిందని, ఇచ్చిన హామీలతో అధికారం పొందిన తర్వాత వాటిని అమలుపరచక ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తుందని తపస్ జిల్లా అధ్యక్షులు ఊడెం రఘు వర్ధన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట పట్టణంలోని శిశు మందిర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో జిల్లా అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి.. రాష్ట్ర కార్యదర్శులు పింగోజు జనార్ధన్, పబ్బతి శ్రీనాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుముల మురళీధర్ లతో కలిసి సెప్టెంబర్ 1న నిర్వహించే మన పాఠశాల మన ఆత్మగౌరవం, ఆత్మగౌరవ స