మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో శుక్రవారం సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గణేష్ మండపాల వద్ద విద్యుత్ పనులు అనుభవజ్ఞులైన వారితోనే చేయించాలని సూచించారు. నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఒకే రోజు వస్తున్నందున పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.