నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా పలువురు జిల్లా నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ కార్యకర్తలతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ సీతారాం ఏచూరి దేశంలో దోపిడీ లేని వ్యవస్థ, కార్మిక వర్గ రాజ్యం ఏర్పాటు చేయడం కొరకు నిరంతరం కృషి చేశారని అన్నారు. అందుకు విద్యార్థి దశ నుండే ప్రజా ఉద్యమాలపై పనిచేస్తూ క్రమక్రమంగా అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారని ఆయన తెలిపారు.