అన్నమయ్య జిల్లా. మదనపల్లె మండలం, కొత్తవారిపల్లి సమీపంలోని నాలుగు లైన్ల రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 35 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి ప్రయాణిస్తున్న బైకును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు మదనపల్లె మండల పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.