యాదాద్రిభువనగిరి జిల్లా: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సిడి ఎంఏ జెడి నారాయణరావు గురువారం అన్నారు. వందరోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాలు భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులోని ప్రైమరీ స్కూల్లో గురువారం స్థానిక మున్సిపల్ కమిషనర్ కొత్త వెంకట్రామిరెడ్డి తో కలిసి ఆయన మొక్కలు నాటి నీళ్ళు పోశారు. వృక్షో రక్షతి రక్షితః వృక్షాన్ని మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని కాపాడుతాయన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రక్రియలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు.