సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా నిర్వహించారు. రైతులు తమ ఎడ్లను వాగులు, చెరువుల దగ్గరికి తీసుకువెళ్లి ప్రత్యేక స్నానాలు చేయించారు. అనంతరం ఎడ్లకు ప్రత్యేక రంగులతో అలంకరించి గ్రామ దేవతల ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొలాల అమావాస్య పండుగ సందర్భంగా రైతులు పశువులను పూజిస్తూ పండుగను ఘనంగా నిర్వహించారు,