నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జూనియర్ ఎంబీబీఎస్ విద్యార్థిపై సీనియర్ మెడికో విద్యార్థులు ర్యాగింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేశ్ అన్నారు. ఆదివారం నవీపేట్లో వారు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ వృత్తి అనేది సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైనదని అన్నారు. అటువంటి వృత్తిని నేర్చుకునే మెడికోలు తోటి విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ర్యాగింగ్ చేయడం దారుణమన్నారు.