నగరంలోని కాంగ్రెస్ భవన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అధ్యక్షతన పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని, ప్రజల మధ్య తేడా చూడకుండా అందరూ అభివృద్ధి చెందాలని ఆలోచించే వ్యక్తి అని ఆయన తెలియజేశారు.