మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని బొప్పారంలో పంటల సాగుకు అవసరమైన యూరియా కోసం సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నా అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే సరిపడ యూరియా అందించాలని కోరుతున్నారు.