నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని సిపిఐ మండల 15వ మహాసభలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సిపిఐ వందేళ్ళ ప్రస్థానంలో పేద ప్రజల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిందని అన్నారు .ప్రస్తుతం దేశానికి కమ్యూనిస్టుల అవసరం చాలా ఉందని తెలిపారు భారతదేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు.