వేంపల్లి గ్రామపంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని గ్రామపంచాయతీ ఈవో నాగభూషణ్ రెడ్డికి ఆమ్ ఆద్మీ పార్టీ కడప జిల్లా కోఆర్డినేటర్ రహంతుల్లా నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేంపల్లి గ్రామపంచాయతీలో గత కొద్ది రోజులుగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయి అని తద్వారా మలేరియా వంటి వ్యాధులు ప్రబులుతున్నాయని చెప్పారు అలాగే కుక్కలు పందులు గ్రామపంచాయతీలో స్వైర విహారం చేస్తున్నాయని పేర్కొన్నారు. వీధుల్లోని కాలవల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుందని చెప్పారు.