మొరసకుంట తండాలో గిరిజనులు సీత్ల భవాని పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామస్థులు డప్పు వాయిద్యాలతో నైవేద్యాలు తీసుకొని గ్రామ పొలిమేరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లారు. శ్రావణ మాసం పెద్ద పుష్యాల కార్తె మొదటి వారంలో ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకోవడం సంప్రదాయం అని వారు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పశుసంపద అభివృద్ధి చెందాలని అమ్మవారిని గిరిజనులు వేడుకున్నారు.