యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుంచి గజ్వేల్ ప్రజ్ఞాపురం సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారిలోని హనుమాపురం బ్రిడ్జిపై ఉన్న గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను నిరసిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. గుంతల మయమైన రోడ్డును పరిశీలించిన అనంతరం సంఘం నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ రోడ్డుపై వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ప్రమాదాలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.