హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ధనసరి అనసూయ సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో అకాలవర్షాల వల్ల ఏర్పడ్డ నష్టం, వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, జిల్లాలో అకాల వర్షాల కారణంగా ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నామని, అదేవిధంగా పాతఇళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేసుకో