డిస్టిక్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం జిల్లా పోలీసులు నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 కేసులలో పట్టుకున్న రూ.52 లక్షల విలువగల 207.056 కేజీల గంజాయి, 118 గంజాయి చెట్లు, 173 మొత్తం టాబ్లెట్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, పోలీస్ సిబ్బందితో కలిసి దద్దం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా పాఠశాలల్లో, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.