శనివారం వనపర్తి జిల్లా వ్యాప్తంగా రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తమ అన్న తమ్ముళ్లపై ఉన్న ప్రేమ ఆత్మీయతకు నిదర్శనమైన రాఖీ పండుగ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన మహిళలు అదేవిధంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కి మహిళలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున రాఖీ పండుగ ఆత్మీయంగా నిర్వహించుకున్నారు.