వేములవాడ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లా కథలాపూర్,మేడిపల్లి,భీమారం,చందుర్తి,రుద్రంగి,వేములవాడ టౌన్, వేములవాడ రూరల్ మండలంలోని గణేష్ మండపాల్లో భక్తిశ్రద్ధలతో మండప నిర్వహకులు చుట్టుపక్కల ప్రజలు భక్తి భావంతో ప్రత్యేక కుంకుమార్చన అభిషేక పూజ కార్యక్రమాలతో పాటు అన్నప్రసాదం వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి సేవలో తరించారు. ఆదివారం ప్రత్యేకంగా కుంకుమార్చన పూజా కార్యక్రమాలతోపాటు 108 రకాల నైవేద్యాలను సమర్పించి, కోరిన కోర్కెలు తీర్చు స్వామి అని విగ్నేశ్వరుని వేడుకున్నట్టు తెలిపారు. ఊరు వాడ పల్లె అనే తేడా లేకుండా ప్రాంతాలన్నీ వినాయక మండపాలతో కనువిందు చేస్తున్నాయి.