ఎమ్మిగనూరు : గురజాల ఆలయంలో చోరీ.. రూ.30 వేల సామగ్రి దొంగతనం..నందవరం మండలంలోని దక్షిణ కాశీగా పేరొందిన గురజాల రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రూ. 30 వేల విలువైన మైక్, యాంప్లిఫైయర్ వంటి సామగ్రిని దొంగిలించారు. ఆలయంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, సీసీకెమెరాలు పనిచేయకపోవడంతో ఆలయ ప్రతినిధులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పురోహితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.