రైతులు యూరియా కొరత గురించి ఆందోళన చెందవద్దని, అందరికీ సరఫరా జరుగుతుందని చెరుకుపల్లి మండల వ్యవసాయ అధికారి ఫారూఖ్ తెలిపారు. గురువారం చెరుకుపల్లి మండలం రాంబోట్ల వారి పాలెం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. మార్క్ ఫెడ్ ద్వారా 440 బస్తాల యూరియా రైతు సేవా కేంద్రానికి వచ్చిందని, రైతుల ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, విస్తీర్ణం ఆధారంగా ఒక్కో రైతుకు ఒకటి నుండి రెండు బస్తాల యూరియా పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు.